17, ఏప్రిల్ 2014, గురువారం
29, జనవరి 2013, మంగళవారం
jivithadrushyalu( stories)
దైర్యమే సాహసము
రచయిత:పి.ఎస్.ఎస్.వి.వి.మహాలక్ష్మి రాణి కథ ; జరిగిన కథ
తూ .గో.జిల్లా
అది ఒక అందమైన ప్రకృతీ సోయగాలతో మెరిసే పల్లెటూరు ఎటు చూసిన పక్షుల
కిలకిల రాగాలతో పచ్చని ప్రకృతీ పైరు గాలులతో నెలకొన్న వాతావరణము, ఆ వాతావరణము మద్య ఒక అందమైన
కుటుంబం కాపురముండేది . ఆ చక్కని కుటుంబంలో ఇద్దరు దంపతులు ఉండేవారు .వారికి
లేక లేక చాల ఏళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది గారాబంగా పెరిగింది ,అందమైన కుందనపు బొమ్మ తెలివైన
అమ్మాయి విద్యలోను ఆటలలోనూ తన తర్వాతే ఇంకెవరు అయిన స్కూల్ కి వెళ్ళడం బాగా చదవడం మంచి
మార్కులు తెచ్చుకోవడం తోటి పిల్లలతో కలిసి ఆడి పాడడం ,.,..సంతోషం గ వుండడం మాత్రమే ఆమెకి తెలిసినవి .,.
ఇలా 12 సంవత్సరములు గడిచాయి ,.
ఒక రోజు స్కూల్ కి వెల్లుతున్నప్పుడు ,...తనని కొంత మంది దుండగలు
మత్తు ఇచ్చి కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకోని వెళ్తున్నారు .
తనని తీసుకోని వెళ్తున్న ప్లేస్ తనకే తెలియదు ఎందు కంటే అప్పటికే సృహ కోల్పోయింది సాయంత్రం అయింది తల్లి
తండ్రులు కూతురి కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పటికి రాకపోయే సరికి స్కూల్ కి
వెళ్లి కనుకున్నారు ఉదయం నుంచే రాలేదు అని చెప్పారు .,.తెలిసిన వారందరినీ సంప్రదించారు .,.చివరికి
జాడ తెలియక పోయే సరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు .,.అప్పటికే kidnapers చాలాదూరం తీసుకేల్లిపోయారు .
ఆ వాన్ ని చెట్ల మద్యలో పెట్టి దూరంగా కూర్చొని
మందు తాగుతున్నారు .,..ఇంతలో ఆ అమ్మాయి మేలుకోవ వచ్చి కిడ్నాప్ అయిన విషయం గమనించి దైర్యం చేసి
నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది .దూరంగా గ ఒక చిన్న లైట్ కనిపించడం
తో అక్కడికి పరిగెట్టు కొంటు వెళ్లి చూసింది అక్కడ ఒక పెద్దాయన ఉన్నాడు తనకి జరిగింది చెప్పి తన వూరు చెప్పి
తనని వాళ్ళ తల్లి తండ్రుల దగ్గరకు పంపించమని బ్రతిమలాడింది ఆయన వెంటనే ఆ వురి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి
విషయం వివరించాడు .,..వెంటనే పోలీస్ అధికారులు అక్కడకి వచ్చి,kidnapers పట్టుకొని , తనను తీసుకోని వెళ్లి
వాళ్ళ తల్లి తండ్రులను అప్పగించారు .,.ఆ అమ్మాయి దైర్యాన్ని మెచ్చుకొని తనని ఇంటికి పంపించారు
ఇప్పుడు తను పెద్దది అయి చదువుకొని మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తుంది ,.,.
నీతి: దైర్యం ఎప్పుడు విజయాన్ని సాదిస్తుంది కాబట్టి దైర్య సాహసాలే విజయానికి తోలి మెట్టు , కాబట్టి దైర్యము తో వుండండి
24, జనవరి 2013, గురువారం
jivitadrushyalu(suktulu)
సూక్తులు
1.జీవితమ్ అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్ని సార్లు ఓడిన గెలవడానికి మరో అవకాశం ముంటుంది .,.
2.తినే ఆహారం వలన దేహ బలం చదివే పుస్తకాల వలన మనో బలం చేకూరుతాయి ,అని అంటారు కాని తినే ఆహారం మీద ఉండే శ్రద్ద చదువు విషయంలో యెంత మందికి ఉంటుంది .,.
3. కెరటం నాకు ఆదర్శం ఎగిసి పడుతున్నందుకు కాదు పడిన పైకి లేస్తున్నందుకు !
4. తప్పులు అందరు చేస్తారు కాని చేసిన తప్పును సరిదిద్దుకొనే వాడు మనిషి .,
5. మనల్ని బాదపెట్టే నిజం కన్నా సంతోష పెట్టె అబద్దం మంచిది .,.
6. చీకటి తరువాత వెలుతురూ వస్తుంది ప్రయత్నం తరువాత పలితం వస్తుంది .,..
7. విశ్రాంతి లేదు ఈ కష్టాల జీవితమ్ లో కష్టపడు పలితాన్ని ఆశించకు పనిని ఇష్టపడు పలితం దానింతట అదే
వస్తుంది .,.
8.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలం ,కాని కన్నీళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము .,...
9. తన కోసం బ్రతికే వాడు స్వార్ధపరుడు ,పరులకోసం బ్రతికే వాడు నిస్వార్ధపరుడు ,మార్పు కోసమే నా
ఈ ప్రయత్నం
10. నవ్వాలి నవ్వుతూ బ్రతకాలి ,జీవితమనె సముద్రంలో బాధలను కష్టాలను మరిచిపోయి ఉన్నన్నాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ బ్రతకాలి అనేది నా కోరిక
1.జీవితమ్ అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్ని సార్లు ఓడిన గెలవడానికి మరో అవకాశం ముంటుంది .,.
2.తినే ఆహారం వలన దేహ బలం చదివే పుస్తకాల వలన మనో బలం చేకూరుతాయి ,అని అంటారు కాని తినే ఆహారం మీద ఉండే శ్రద్ద చదువు విషయంలో యెంత మందికి ఉంటుంది .,.
3. కెరటం నాకు ఆదర్శం ఎగిసి పడుతున్నందుకు కాదు పడిన పైకి లేస్తున్నందుకు !
4. తప్పులు అందరు చేస్తారు కాని చేసిన తప్పును సరిదిద్దుకొనే వాడు మనిషి .,
5. మనల్ని బాదపెట్టే నిజం కన్నా సంతోష పెట్టె అబద్దం మంచిది .,.
6. చీకటి తరువాత వెలుతురూ వస్తుంది ప్రయత్నం తరువాత పలితం వస్తుంది .,..
7. విశ్రాంతి లేదు ఈ కష్టాల జీవితమ్ లో కష్టపడు పలితాన్ని ఆశించకు పనిని ఇష్టపడు పలితం దానింతట అదే
వస్తుంది .,.
8.కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలం ,కాని కన్నీళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము .,...
9. తన కోసం బ్రతికే వాడు స్వార్ధపరుడు ,పరులకోసం బ్రతికే వాడు నిస్వార్ధపరుడు ,మార్పు కోసమే నా
ఈ ప్రయత్నం
10. నవ్వాలి నవ్వుతూ బ్రతకాలి ,జీవితమనె సముద్రంలో బాధలను కష్టాలను మరిచిపోయి ఉన్నన్నాళ్ళు నవ్వుతూ నవ్విస్తూ బ్రతకాలి అనేది నా కోరిక
23, జనవరి 2013, బుధవారం
jivithadrushyalu(abala abyardana)
అబల అభ్యర్దన
1. లంగా జాకిట్టు వేస్కొని బడి కి వెళ్ళే రోజు నుండి
కాలేజి వరకు ,కాదు పెళ్ళయ్యాక ఇప్పటి వరకు
కూడా నన్ను గుచ్చని పురుష చూపు లేదు .
నన్ను వేదించని పురుష వాక్కు లేదు .
ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా ,
నా కంటే చిన్న వారు పెద్ద వారు సైతం
ఈటెల లాంటి మాటలతో సూదుల లాంటి చేతలతో బాదిస్తున్నారు .
అసలు నేను చేసిన నేరం ఏమిటి ?
ఎవరి శాపం వలన నాకి ఈ బాదలు ?
అని ఆలోచించాను ,నా శత్రువే వీటన్నిటికి కారణం
అదే "నా అందం " అనుకున్నా
అందువల్లే ఈ చిత్ర హింసలు అనుకోని
ఆడవాళ్ళ ని ఎవరిని అందంగా పుట్టిన్చావద్దు
అని దేవుణ్ణి ప్రార్దించాను , ఆనాడు అబలపై
ఆమ్లాన్ని చల్లిన రోజు ,కాని ఈనాడు
అందమైన ఆడధాన్నే కాకుండా
వయసుతో భేదం లేదంటూ
మనసుతో పని లేదంటూ ,
ఆడదయితే చాలంటూ అనుబవిస్తూ
అంగ వైకల్యలను సైతం
చేల్లిలి వరసయిన వారిని,
కూతురి వరసయిన వారిని,
వదిన వరసయిన వారిని,
మాటలతో చూపులతో కాకుండా
చేతలతో కూడా చిత్రహింసలు పెట్టి
కామపిసచం ఆవహించినట్టు అపహరించి
అత్యాచారాలు చేసి హతులగా, మృతులుగా ,మారుస్తున్నారు
ఇలాంటి ఆకృత్యాలకూ ఆడవాళ్ళూ బలికాకుండా
నేడు ఆ దేవుణ్ణి ప్రార్ద్దిస్తున్నాను "అసలు " ఆడదాన్నే
పుట్టిన్చావద్దు అని .,.
ఇక ముందు పుట్టబోయే ఆడపిల్లలకు ఇలాంటి దారుణాలు జరిగి మనం బాధపడి వారికీ న్యాయం చేయలేకపోయాం
అని చింతించే పరిస్తితి తప్పుతుందేమో అని నా అభిప్రాయం .,.
ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు ఇది నా ఉద్దేశం మాత్రమే ,,,,,నా రైటింగ్స్ మీద మీకు ఉన్న ఎలాంటి అభిప్రాయాన్ని అయినా మీరు నాకు మెయిల్ చేయవచ్చు.,....
rudrammamahalakshmi
భరతమాత ఆవేదన
కనపడింది భరతమాత కన్నీరు కారుస్తూ
కారణం ఏమిటి తల్లి అని అడగగా
వాహనాల మంత్ర దూమాలతొ
అంబరాన నల్లని మేఘాలే నివాసముంటున్నాయి అని
స్వచ్చంగా గలగలా పారే నీరు
పరిశ్రమల పొగలతో నురగలు కక్కుతున్నాయి అని
తీరానికి చేర్చవలసిన యంత్రాలే అన్యాయాలకు పాల్పడుతున్నాయి అని
పచ్చని చెట్లు తోరణాలు సైతం అజ్ఞానపు గోడ్డల్లకి బలిఅవుతున్నాయి అని
వున్న్మధంతో అబలల మల్లెపువ్వు లాంటి జీవితాలు
నాసనమవుతున్నాయి అని
స్వేచ్చాప్రాణులను కూడా వదిస్తున్నారని ఎటు చూసిన
బికర శబ్దాలే తప్ప దివ్యనాదాలు వినపడడం లేదని
ఆర్తనాదాలు ఆకలి కేకలు తప్పా ఆప్యాయతా అనురాగాలకు చోటు లేదని
ఇలాగైతే తాను సృష్టించుకున్న మనుషుల మనుగడకు ముప్పు
వాటిల్లుతుందని తన బిడ్డలమయిన మనందరికోసం పరితపిస్తూ
కనబడింది తల్లిభారతి కన్నీరు కారుస్తూ కలలో .,...........
అమ్మ ప్రేమ
సృష్టిలో ఇలువైనది వెలకట్టలేనిది అమ్మ ప్రేమ , దేవుడు తనని అమ్మలో చేసుకోమని తనకి బదులుగా , అమ్మని సృష్టించారు ,....కాబట్టి అమ్మని ఆరాధ్య దైవం గ పూజిద్దామ్ .,....,.అమ్మ తినిపించిన గోరు ముద్దలు ప్రేమానురాగాలకు పూనాదులు .,..,.
నేటి యువత
ఆటు పోటుల్లో సునామిల
క్షుద్ర సెక్స్ క్రైమ్ లతో
అతి నీచమైన గోరాలకు పాల్పడుతూ
వాస్తవాలకు దూరమవుతూ
అందమైన జీవితాన్ని నాశనం
చేసుకుంటూ రంగు రంగుల ఈ
ప్రపంచాన్ని వదులుకుంటూ
క్షణికమైన ఆవేశాలకు లొనవుతూ
అన్యాయాలకు పాల్పడుతూ
పువ్వులాంటి ఆడపిల్లల మల్లె మనసు పాడుచేస్తూ
నూరేళ్ళ జీవితాన్ని వృదా చేస్తూ
ఈ నేటి యువతలో మార్పు రావాలి
ఈ నేటి యువత వలన భవ్య తరానికి మేలు జరగాలి అని కోరుకుంటూ ,..
మీ ........
పి . మహాలక్ష్మి రాణి
ఈనాడు
ఈనాడు ఏనాడు ఏదో ఒక నాడు
రాజకీయపు headlines తో ,
జనసముహానికి అవసరమైన నిత్యావసర వస్తువుల adds తో
దూరగతాలకు పాల్పడే దుర్మాగుల ఫోటోలతో ,
దోపిడిలు చేసే దొంగలను పట్టుకున్న పోలీసులు అనే హెడ్ లైన్స్ తో
పోలిసుల ధైర్య సాహసాలు ,
నిరుద్యోగులకు క్లాసిఫైడ్ అడ్డ్స్ తో ,
తస్మాత్ జాగ్రత్త ప్రకటనలతో ,
జనాలకు తెలియని విషయాలను తెలియ బరుస్తూ ,
వింతలూ విశేషాలు చూపిస్తూ ,
'హాయ్ బుజ్జి ' అని చిన్న పిల్లలకు ఆనందాన్ని అందిస్తూ ,
విద్యార్దులకు ప్రతిభతో guiendency ని ఇస్తూ
సాదించిన విజయ మ్యాచ్ ను క్షణాల్లో మనకు చూపిస్తూ ,
ఏ చానెల్లో ఏముంది ?
ఏ సినిమా ఏ హాల్ లో అంటూ.,.
నిత్యం మనకోసం పనిచేస్తూ .,..ఈనాడు కు ఇదే నా జోహారు
ఏనాడో కాదు ఈనాడే ఈ సబ్య సమాజం మెరుగు పొంది
రేపటి భవ్య తరానికి ఆదర్శం కావాలన్నదే " ఈనాడు" ముఖ్య ఉద్దేశం
' అనేదే నా ఉద్దేశం '
----------------------------------------------------------------
అమ్మ ఈ పదానికి ఎన్ని అర్దాలు ఇచ్చిన తక్కువే నాయి చెప్పచ్చు , సృష్టికి ప్రతి రూపం అమ్మ , పెదవి పలికే మొదటి అక్షరం అమ్మ , ఎన్ని జన్మలు ఎత్తిన తిర్చుకోలేని ఋణం మన అమ్మ ఋణం , నవమాసాలు మోసి కనీ పెంచిన అమ్మని అమ్మల చూస్తున్న వాళ్ళం ఎంతమంది .,.....తను తిన్న తినక పోయిన మన పొట్ట నింపుతుంది అమ్మ ,.,..అమ్మని ప్రేమించిన ప్రతి మగవాళ్ళు బార్య పిల్లలని తప్పకుండ ప్రేమిస్తాడు ,.,..,..తన ఊపిరి తో తన బిడ్డకి ఊపిరి పోసేదే అమ్మ .,...,....,.ఇలా అమ్మ గురించి యెంత చెప్పిన తక్కువే దయ చేసి అమ్మని బాధ పెట్టద్దు .,..
జీవితమ్
జీవితమనెది ఒక పుస్తకం లాంటిది
ఎన్ని పేజి లు చదివిన తరగనది ,
కొన్ని నచ్చని పేజి లు ఉంటాయి ,
కొన్ని నచ్చినవి ఉంటాయి ,
నచ్చని పేజి లు కష్టాలు
నచ్చిన పేజి లు సుఖాలు
చిగిరిన పేజి లు ఉంటాయి
చిరిగినా పేజి కోసం బాధపడద్దు .,.
ముందు ఉన్న కొత్త పేజి నీకు నచ్చినట్టు రాసుకో ,.
గతించిన దాని గురించి నీకు అనవసరం ,
జరగబోయేది నీకు అవసరం ,.,...
ఉగ్రవాదం బాంబ్ బిబత్సవం
ఉగ్రవాదం పేరు మారణహోమం సృష్టించిన
కిరాతుకుల ఘాతుకానికి అమాయకుల బలి
మనసుని బాదపరుస్తుంది
ఎవడి అబ్బ సొమ్ము అని మనుషుల ప్రాణాలు
ఏ అధికారం వుందని క్షతగాత్రులను చేయడానికి
మనుషులనుమనిషి చంపడమేనా మానవత్వం
మనిషికి ఎందుకు ఈ క్రూరత్వమ్
మనిషికి మనిషికి ఎందుకు ఈ పగ
మనసు లేని మనుషులు గ జీవించడం ఎందుకు
అమాయకులను బలి తీసుకోని
తిరిగి వస్తారని ఎదురు చుసిన ఆత్మీయులకు
తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు అనే వార్తను తెలియజేసి
జిర్నిచుకోలేని ఆత్మీయుల ఆర్త నాదాలు
మనసును చాల బాదిస్తుంది
ఎందుకు ఈ కక్ష బారతియులు ఏం చేసారని ఈ శిక్ష
ఇది జరగడం వలన ఒరిగింది ఏమిటి
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ మారణ హోమాలు ....
jivithadrushyalu (jokes)
హాస్యం
"ప్రతి ఒక్కరు రోజు ఒక్క సారి అయినా నవ్వాలి అనేది నా కోరిక " ఒక్కరిని అయినా నవించాలని నా ఆశ
1. చీమ ఏనుగు మంచి స్నేహితులు షికారుకు వెళ్దాం అని
ఒక రోజు బస్సు ఎక్కాయి బస్సు కండక్టర్ వచ్చి చీమని
టికెట్ అడిగాడు కానీ ఏనుగును అడగలేదు ఎందుకు ?
జవాబు: చీమకి బస్సు పాస్ ఉంది!
2. చీమ ఏనుగు దొంగ పోలీస్ గేమ్ ఆడుతున్నాయి
చీమ దొంగ , ఏనుగు పోలీస్ చీమ ఏనుగుకు కనిపించకుండా
వెళ్లి గుళ్ళో దాక్కుంది ఏనుగు చీమని కనిపెట్టింది ఎలా?
జవాబు: చీమ చెప్పులు వేసుకుంది గుడి బయట చూసి కనిపెట్టింది !
3. ఆహారం కోసం రెండు పావురాలు ఆకాశం లో వెళుతున్నాయి
అవి రెండు గుడ్డు పెట్టె సమయం,రెండు ఒక సారే గుడ్డు పెట్టాయి
ఒక దాని గుడ్డు కింద పది పగిలిపోయింది రెండొవదాని గుడ్డు
కింద పడలేదు పగలలేదు ఎలా?
జవాబు: అది అండర్ వేర్ వేసుకుంది కాబట్టి !
4. "till ants wear cheppals"
5. చీమ ఏనుగు స్నేహితులు
చీమ కూతురి పెళ్లి చీమ ఏనుగు దగ్గరి వచ్చి
స్నేహితుడా నా కూతిరి పెళ్లి అన్ని చోట్ల వెతికి చూసా
ఎక్కడ దొరక లేదు కాబట్టి నీ ప్యాంటు ఒక సారి ఇస్తావ
అని అడిగింది ఎందుకు నా ప్యాంటు నీకు అంది
నాకు ఎక్కడ టెంట్ దొరకలేదు కాబట్టి
నీ ప్యాంటు తో టెంట్ వేద్దాం అని .,.................
6. చీమలు అన్ని కలిసి లైన్ లో షుగర్ కోసం వెళుతున్నాయి
కాని ఒక చీమ మాత్రం పక్క నుంచి వెళుతుంది అసలు
పట్టించు కోవడం లేదు,ఇంకొక చీమ చూసి ఏమిటి నువ్వు
మాతో షుగర్ కి రావడం లేదు ఎందుకు ?అంది
జవాబు: నా వంట్లో షుగర్ ఉంది
7. చీమ దోమ పెళ్లి చేసుకున్నాయి
ఫస్ట్ నైట్ రోజు చీమ గదిలో ఉంది
దోమ మాత్రం బయట అటు ఇటు తిరుగుతుంది
దోమ స్నేహితుడు వచ్చి ఏమైంది ర టెన్షన్ పడుతున్నావ్
బయమేస్తుందిరా ? ఛి మగాడివి ర నేకు బయమేంటి రా
అది కాదు రా బాబు దానమ్మ అల్ అవుట్ పెట్టు కొని పడుకుంది రా !
8. టీచర్ : కార్తిక్ నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా?
కార్తిక్ : అడగండి టీచర్ ?
టీచర్ : నువ్వు టీ కప్ లో టీ ని చూడగలవా ?
కార్తిక్ : ఎస్ టీచర్ చూడగలను !
కార్తిక్ : టీచర్ మిమ్మల్లన్ని ఒక ప్రసన అడగవచ్చా ?
టీచర్ : ఓ ఎస్ అడుగు
కార్తిక్ : టీ కప్ లో టీ ని చూసాను కదా మీరు వరల్డ్ కప్ లో వరల్డ్ చూడగలరా ?
20, జనవరి 2013, ఆదివారం
jivitadrushyalu(kavitalu)
కవితలు
పల్లెతల్లి
స్వచ్చమైన చల్లని చిరుగాలులతో
సెలయేటి మువ్వల సవ్వడులతో
పచ్చటి మొక్కల తోరణాలతో
పక్షుల స్వాగత కిలకిలరావాలతో
సౌన్దర్యామ్రుతాన్ని చవి చూపుతూ
ఆత్మీయతా అనురాగాలకు ఆలవామై
సహజత్వానికి మారుపేరే "పల్లితల్లి"
ప్రేమంటే
I- న వాళ్ళు ఎందరు ఉన్నా
L- ప్పుడు నిన్నే పరితపిస్తూ
O- క్క క్షణం కూడా నిన్ను
V- డిచి పెట్టి ఉండలేక
E- లోకంలో నే
Y- పునకు నడిచేందుకు
O- క్క క్షణం కాదు
U- గ యుగాలైనా వేఛి వుంటా .,....
ఎదురు చూస్తున్నా
నా గుండె గూటి లో చేరిన ఓ పావురమా నీ కోసమే బ్రతికే ఓ ప్రాణమా
నన్ను విడిచి యెంత దూరమ్ వెళ్ళావో తెలియక నా మనసు పడే నరక యాతన తెలుసుకొని ఎంత త్వరగా తిరిగివస్తావని ఎదురు చూస్తూ వుంటాను ,.
"నా కిష్టం"
ముఖ ప్రీతి కోసం నా అంత గొప్పవాడు లేడని
చిటేకేన వేలుమీద ఆకాశానికి ఎత్తి ప్రసంచించే
వాళ్ళ కన్నా ముఖం ముందు తన తప్పులను
చెప్పి తనను సరి అయిన మార్గంలో
నడిపించాగలను అనే నమ్మకాన్ని ఎవరైతే
కలిగిస్తారో అలాంటి వాల్లెంటేనే " నాకిష్టం "
స్వరూప
రూపానికి ఆకారం
స్వరూపానికి మనిషాకారం
మనిషాకారానికి సంసాస్కరం
కవిత్వాలు,రత్నాలు
హృదయ లోతుల నుండి పుడుతాయి కవిత్వాలు
సముద్ర లోతుల నుండి పుడుతాయి రత్నాలు
కవిత్వాలు సంతోషాన్ని తెచ్చిపెడితే ,
రత్నాలు అందాన్ని తెచ్చిపెడతాయి .,..
క్రూరత్వమ్
మాత్రుమూర్తి గర్భంలో నవమాసాలు నిండకుండానే
సాంకేతిక నైపుణ్యపు స్నానింగ్ లో " ఆడపిల్ల "అని తెలిసిన తద్యం
అజ్ఞానం తో అబార్షన్ తనలాగే తన తల్లి ఆలోచిస్తే తనే ఉండదని మరుస్తూ ఈ నేటితరం యువతీ యువకులు
రచయిత మరియు రచయిత్రి
'అక్షరానికి 'విలువనిచ్చి
'పదానికి' పరువునిచ్చి
'వాక్యానికి' ఆర్దాన్నిచ్చి
ఆ అర్దాన్ని పరమార్దం చేసి
ఆ పరమార్ధాన్ని పదిమందికి
తెలియజెప్పే గొప్ప వ్యక్తి
రచయిత
ఒక చేత వలన మనిషి మారకపోవచ్చు
కాని ఒక రచన వలన మారుతాడు
ఎందుకంటే ఒక చేత మనిషిలో ద్వేషాన్ని పెంచుతుంది
అదే ఒక రచన మనిషిని ఆలోచింపజేస్తుంది
ఆ ఆలోచనల నుండి మనిషిని మార్పు వైపు నడిపిస్తుంది .,.
మీ ,
మహాలక్ష్మి రాణి
రచయిత మరియు రచయిత్రి
'అక్షరానికి 'విలువనిచ్చి
'పదానికి' పరువునిచ్చి
'వాక్యానికి' ఆర్దాన్నిచ్చి
ఆ అర్దాన్ని పరమార్దం చేసి
ఆ పరమార్ధాన్ని పదిమందికి
తెలియజెప్పే గొప్ప వ్యక్తి
రచయిత
ఒక చేత వలన మనిషి మారకపోవచ్చు
కాని ఒక రచన వలన మారుతాడు
ఎందుకంటే ఒక చేత మనిషిలో ద్వేషాన్ని పెంచుతుంది
అదే ఒక రచన మనిషిని ఆలోచింపజేస్తుంది
ఆ ఆలోచనల నుండి మనిషిని మార్పు వైపు నడిపిస్తుంది .,.
మీ ,
మహాలక్ష్మి రాణి
19, జనవరి 2013, శనివారం
jivitadrushyalu
జీవితద్రుశ్యాలు
జీవితమ్: జీవించింది కొన్నాళ్ళు అయినా ఉన్నతం గా జీవించు ఉన్నన్నాళ్ళు ,జీవించడమ్ మరిచిపోయినా జీవితాన్ని మరిచిపోకు డైలీ న్యూస్ పేపర్ కాదు జీవితమ్ అదో మహా అద్ద్భుతమైన కావ్యం
జీవితమనె చెట్టుకి చిగురుటాకు పుట్టి భాద్యతలతో ముదిరి అనుభవంతో పండి ఆయాసం తో రాలిపోతుంది .,
శిశువు ఆవేదన: ఈ లోకాన్ని చూడటానికి ఎంతో ఆరాటపడతారు గర్భంలో కాని పుట్టిన మరు నిమిషమే విసుగు చెంది ఏడుస్తారు .,...
మాట; గొంతు పల్లవితో ఆలోచనల చరణాలతో పాడే పాట మాట .,...
కన్నీళ్ళు; ఆకా స హృదయానికి గాయమైనపుదు మెగ నయనాలు వర్షించేవి కన్నీళ్ళు .,..
స్వచ్చమైన మనసు: స్వచ్చమైన పాలమసుకు స్వార్ధపు ఉప్పు తగిలితే విరిగిపోతుంది .,..
అసూయ: పులిలా గాన్ద్రించలేక గాదిదాల ఓన్ద్రపెడుతుంది అసూయ .,.....
అనుభవం ; జీవిత కొవ్వెత్తి కరుగుతున్న కొద్ది అనుభవం కాంతి ఎక్కువ అవుతుంది .,....
ఆహారం; ఆకలి రోగానికి ఆహరం మందు .,..
మౌనము; గొంతు మతిమరపుతో మాటల్ని మరిచిపోవడమే మౌనం .,..
చైతన్యం : మంద భుద్దికి సుప్రభాతం చైతన్యం చైతన్యం లేని వాడి జీవితమ్ వ్యర్ధం.,
కోరికలు: కోరికల మనసు గుర్రానికి బుద్ధి కళ్ళెం వేయకపోతే కష్టాల రహదారిలో కూలబడిపోతుంది .,.
ప్రేమవిఫలం: ఎవరి మనసు పాడయిన ప్రేమ ఫలించదు మరకలు అద్దంపై ఉన్నా ముఖంపై ఉన్నా వికృతి ప్రతిబింభమే ప్రత్యక్ష మవుతుంది
అక్షరజ్యోతి ; అజ్ఞానాన్ని వదులుకొని అ ఆ లు నేర్చుకో జ్ఞాన కాంతి ప్రసరించేది అక్షర జ్యోతిని తెలుసుకో
డబ్భు: ఆహారం లేనిదే ప్రాణి జీవించదు ఇంధనం లేనిదే వాహనం పనిచేయదు కరెంటు లేనిదే బల్భు వేలుగదు డబ్బు లేనిదే జీవిథమ్ సాగదు .,
ప్రేమ: ప్రేమ కోకిలైతే బ్రతుకు మడురగానం ప్రేమ పామైతే బ్రతుకు విషం .,..
ఆలోచన: సమస్యను పరిష్కరించడానికి మెదడు ఇచ్చే లంచం ఆలోచన.,
మృత్య్వువు : ఏ జీవి ఎన్నాళ్ళు ఎక్కడ ఎలా జీవించినా ఆకరి మజిలి మృత్య్వువు .,...
రూపమ్:అధికంగా మిదిసిపడకు అందమైన రూపును చూసి యెంత కాలం నిలుస్తుంది తామరాకుపై నీటిబొట్టు .,.
హరివిల్లు: చేయి చేయి కలపాలి అందరు స్నేహ భావంతో , అన్నిరంగులు కలిస్తేనే హరివిల్లు ,....
బలి : మంచి తనం ఉన్నా మెత్తగా కనపడకు పులిగా గాన్ద్రిస్తారు మేకను చేసి బలిస్తారు .,.
ధనం : వుందని గర్వపడకు అధికంగా ధనం ,అలాగే నిలుస్తునండా మిన్తికేగాసిన కెరటం .,..
తప్పు: తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు ముంచుతుంది తెలిసి తాగిన తెలియక తాగిన విషం చంపుతుంది .,...
తల్లితండ్రులు: వున్నత స్తితిలోకి వచ్చాక తల్లితండ్రులు విడువకు , ఎన్ని అంతస్తులు వేసినా పునాదిని మరువకు ,...
ఓట్లు: వాగ్దానాలకు మోసపోయి ఓట్లను జారవిడువకు ఆకాసంలో మబ్బుని చూసి ముంతలో నీళ్ళు ఓంపుకోకు .,...
పట్టించుకోరు: అస్సలు పట్టించుకోరు అస్తమాను మాట్లాడుతుంటే యెప్పుడూ కూసే కాకిని తరిమేస్తాం ఎప్పుడో కూసే కోకిలని చేరదిస్తాం .,....,..
భేదం; బేదం చూపకు ఆడపిల్లకి ,మగపిల్లవాడికి తేడా లేదుగా కుదికన్నుకి ఎడమ కన్నుకి తెలుసుకొ .,....,..,.
విలువ: లేనప్పుడే తెలుస్తుంది దేని విలువైన అన్నిటి మీద ఆసక్తి కలిగేది ఉపవాసం ఉన్నప్పుడే .,..
ప్రగతి పయనం: ప్రగతిలో పయనించడానికి ప్రోత్య్సాహం కావాలి విత్తనం మొలకెత్తడానికి నీరుపోయాలి కాయకోయ్యడానికి కర్ర కావాలి పెట్టుబడి లేనిదే ఏ వస్తువు నోటికి అందదు .,.
ఆదర్సవాదులు: ఎన్నో వర్షపు చినుకుల్లో కొన్నే ముత్యాలు అయినట్టు పుట్టిన అందరిలోనూ ఆదర్సవాదులు కొందరే?
దేవుడు:మొండిగా వాదించకు దేవుణ్ణి చూపమని గాలి కనపడనంతమాత్రాన అది లేదని చెప్పగలమా?
దాత: గుడిలో దేవునికి పదిపైసలు వేయకపోయినా పరవాలేదు కానీ గుడి ముందున్న పేదవారిని ఆడుకొనే వాడే దాత .,...
తెలుసుకో: సంపాదన అంతా సుఖం కోసం సంతోషం కోసం అయిన అవి ఏవి జీవిత పరమార్ధాలు కావని తెలుసుకో,...
ఎవరిని దూశించకు ఆకాశాన్ని చూసి ఉమ్మి వేయకు ,కస్తంలోనే సుఖం విలువ తెలుస్తుంది చికటి లోనే నక్షత్రాలు కనపడతాయి
దరి చెరనీయకు దుర్గునాలు కలవాడిని ఒక్క చేద పురుగు చాలు పవిత్ర గ్రందాన్ని పాడు చేయడానికి ,.....
వ్యదల్లిని దిగ మింగుతూ కష్టాలను బరిస్తూ ఆనందాన్ని నటిస్తూ సుదల్ల్నీ నలుగురిరికి పంచు గులాభి మొక్క ముళ్ళను ఉంచుకొని అందమైన పువ్వుల్లెన్నే అందిస్తుంది .,,
కాలిగా కూర్చోకు : ఎప్పుడో ఏదో వస్తుంది అని ఎప్పుడూ కాలిగా కూర్చోకు కెరటాలు ఆగిన తర్వాత స్నానం చేద్దాం అనుకోకు
మనసు: ఎదుటివాని మనసు బాదపడకుండా మాట్లాడటం నేర్చుకో అద్దం ఒక్క సారి ముక్కలైతే తిరిగి అతకలేమని తెలుసుకో .,...
కష్టపడందే: ఉన్నతస్తానం పొందలేవు ఉలి దెబ్బలు తినందే రాయి దైవం గ మారలేదు ..,...
జీవితమ్: జీవించిన్ది కొన్నాళ్ళు అయిన ఉన్నతమ్ గా జీవించు క్షణకాలపు మెరుపు అయినా ఉజ్వలంగా వెలుగుతుంది గాలిదీపం , రానీయకు కొద్ది అనుమానాన్ని అయి న నీ నీడను చూసి నువ్వే బయపడకు .,.
మంచివాడయితే గౌరవించు వయసులో చిన్నవాడయిన పెద్ద ఉప్పు నీటి సముద్రము కన్నా చిన్న మంచినీటి వాగే దాహం తీర్చేది .,.....
నిర్జీవం: చేట్టులేని భూమి ప్రాణం లేని జీవి నీరు లేని బావి నిప్పు లేని భోగ్గు జనం లేని ఊరు .,....
సగటు బ్రతుకు:దారిద్రపు అరికాళ్ళకి వడ్డిల బుట్లకి నలిగి మాసి మసై పోతున్న సాక్స్ మధ్యతరగతి మనిషి.,
డైరీ: దాని హృదయం చాలా విశాలం అందుకే మంచి అయినా చెడు అయినా గుట్టుగా దాచుకుంటుంది రట్టు చేయకుండా నువ్వు చేసిన ప్రతి పని నీతో పాటు దానికి తెల్సని మరువకు ఏనాడు దాని ముందు కాలర్రేగారేయ్యకు.,..
అందినవరం: నీకు దొరకని దానిని వెతకొద్దు దొరికిన దానిని వదలొద్దు అందనిదానికోసం ఆసపడద్దు అందినా దానితో సంతృప్తి చెందు.,.
లోపమ్ : ఎదుటివాని లోపాన్ని ఎంచొద్దు నీ లోపాన్ని సరిదిద్దుకో.,,..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)













