19, జనవరి 2013, శనివారం

jivitadrushyalu

                                                                  జీవితద్రుశ్యాలు

జీవితమ్: జీవించింది  కొన్నాళ్ళు అయినా ఉన్నతం గా  జీవించు ఉన్నన్నాళ్ళు ,జీవించడమ్ మరిచిపోయినా జీవితాన్ని మరిచిపోకు డైలీ న్యూస్ పేపర్ కాదు జీవితమ్ అదో మహా అద్ద్భుతమైన కావ్యం 
జీవితమనె చెట్టుకి చిగురుటాకు పుట్టి భాద్యతలతో ముదిరి అనుభవంతో పండి ఆయాసం తో రాలిపోతుంది .,

శిశువు ఆవేదన: ఈ లోకాన్ని చూడటానికి ఎంతో ఆరాటపడతారు గర్భంలో కాని పుట్టిన మరు నిమిషమే విసుగు చెంది ఏడుస్తారు .,...

మాట; గొంతు పల్లవితో ఆలోచనల చరణాలతో పాడే పాట మాట .,...

కన్నీళ్ళు; ఆకా స హృదయానికి గాయమైనపుదు మెగ నయనాలు వర్షించేవి కన్నీళ్ళు .,..

స్వచ్చమైన మనసు: స్వచ్చమైన  పాలమసుకు స్వార్ధపు ఉప్పు తగిలితే విరిగిపోతుంది .,..

అసూయ: పులిలా గాన్ద్రించలేక గాదిదాల ఓన్ద్రపెడుతుంది  అసూయ .,.....

అనుభవం ; జీవిత కొవ్వెత్తి కరుగుతున్న కొద్ది అనుభవం కాంతి ఎక్కువ అవుతుంది .,....

ఆహారం; ఆకలి రోగానికి ఆహరం మందు .,..

మౌనము; గొంతు మతిమరపుతో మాటల్ని మరిచిపోవడమే మౌనం .,..

చైతన్యం : మంద భుద్దికి సుప్రభాతం చైతన్యం చైతన్యం లేని వాడి జీవితమ్ వ్యర్ధం.,

కోరికలు: కోరికల మనసు గుర్రానికి బుద్ధి కళ్ళెం వేయకపోతే కష్టాల రహదారిలో కూలబడిపోతుంది .,.

ప్రేమవిఫలం: ఎవరి మనసు పాడయిన ప్రేమ ఫలించదు మరకలు అద్దంపై ఉన్నా ముఖంపై ఉన్నా వికృతి ప్రతిబింభమే ప్రత్యక్ష మవుతుంది 

అక్షరజ్యోతి ; అజ్ఞానాన్ని వదులుకొని అ ఆ లు నేర్చుకో జ్ఞాన కాంతి ప్రసరించేది అక్షర జ్యోతిని తెలుసుకో

డబ్భు: ఆహారం లేనిదే ప్రాణి జీవించదు ఇంధనం లేనిదే వాహనం పనిచేయదు కరెంటు లేనిదే బల్భు వేలుగదు డబ్బు లేనిదే జీవిథమ్ సాగదు .,

ప్రేమ: ప్రేమ కోకిలైతే బ్రతుకు మడురగానం ప్రేమ పామైతే బ్రతుకు విషం .,..

ఆలోచన: సమస్యను పరిష్కరించడానికి మెదడు ఇచ్చే లంచం ఆలోచన.,

మృత్య్వువు : ఏ జీవి ఎన్నాళ్ళు ఎక్కడ ఎలా జీవించినా ఆకరి మజిలి మృత్య్వువు .,...

రూపమ్:అధికంగా మిదిసిపడకు అందమైన రూపును చూసి యెంత కాలం నిలుస్తుంది తామరాకుపై నీటిబొట్టు .,.

హరివిల్లు: చేయి చేయి కలపాలి అందరు స్నేహ భావంతో , అన్నిరంగులు కలిస్తేనే హరివిల్లు ,....

బలి : మంచి తనం ఉన్నా మెత్తగా కనపడకు పులిగా గాన్ద్రిస్తారు  మేకను చేసి బలిస్తారు .,.

ధనం : వుందని గర్వపడకు అధికంగా ధనం ,అలాగే నిలుస్తునండా మిన్తికేగాసిన కెరటం .,..

తప్పు: తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు ముంచుతుంది తెలిసి తాగిన తెలియక తాగిన విషం చంపుతుంది .,...

తల్లితండ్రులు: వున్నత స్తితిలోకి వచ్చాక తల్లితండ్రులు విడువకు , ఎన్ని అంతస్తులు వేసినా పునాదిని మరువకు ,...

ఓట్లు: వాగ్దానాలకు మోసపోయి ఓట్లను జారవిడువకు ఆకాసంలో మబ్బుని చూసి ముంతలో నీళ్ళు ఓంపుకోకు .,...

పట్టించుకోరు: అస్సలు పట్టించుకోరు అస్తమాను మాట్లాడుతుంటే యెప్పుడూ  కూసే కాకిని తరిమేస్తాం ఎప్పుడో కూసే కోకిలని చేరదిస్తాం .,....,..

భేదం; బేదం  చూపకు ఆడపిల్లకి ,మగపిల్లవాడికి తేడా లేదుగా కుదికన్నుకి ఎడమ కన్నుకి తెలుసుకొ .,....,..,.

విలువ: లేనప్పుడే తెలుస్తుంది దేని విలువైన అన్నిటి మీద ఆసక్తి కలిగేది ఉపవాసం ఉన్నప్పుడే .,..

ప్రగతి పయనం: ప్రగతిలో పయనించడానికి ప్రోత్య్సాహం కావాలి విత్తనం మొలకెత్తడానికి నీరుపోయాలి కాయకోయ్యడానికి కర్ర కావాలి పెట్టుబడి లేనిదే ఏ వస్తువు నోటికి అందదు .,.

ఆదర్సవాదులు: ఎన్నో వర్షపు చినుకుల్లో కొన్నే ముత్యాలు అయినట్టు పుట్టిన అందరిలోనూ ఆదర్సవాదులు కొందరే?

దేవుడు:మొండిగా వాదించకు దేవుణ్ణి చూపమని గాలి కనపడనంతమాత్రాన అది లేదని చెప్పగలమా?

దాత: గుడిలో దేవునికి పదిపైసలు వేయకపోయినా పరవాలేదు కానీ గుడి ముందున్న పేదవారిని ఆడుకొనే వాడే దాత .,...


తెలుసుకో: సంపాదన అంతా సుఖం కోసం సంతోషం కోసం అయిన అవి ఏవి జీవిత పరమార్ధాలు కావని తెలుసుకో,...

ఎవరిని దూశించకు ఆకాశాన్ని చూసి ఉమ్మి వేయకు ,కస్తంలోనే సుఖం విలువ తెలుస్తుంది చికటి లోనే నక్షత్రాలు కనపడతాయి
దరి చెరనీయకు దుర్గునాలు కలవాడిని ఒక్క చేద పురుగు చాలు పవిత్ర గ్రందాన్ని పాడు చేయడానికి ,.....

వ్యదల్లిని దిగ మింగుతూ కష్టాలను బరిస్తూ ఆనందాన్ని నటిస్తూ సుదల్ల్నీ నలుగురిరికి పంచు గులాభి మొక్క ముళ్ళను ఉంచుకొని అందమైన పువ్వుల్లెన్నే అందిస్తుంది .,,

కాలిగా కూర్చోకు : ఎప్పుడో ఏదో వస్తుంది అని ఎప్పుడూ కాలిగా కూర్చోకు కెరటాలు ఆగిన తర్వాత స్నానం చేద్దాం అనుకోకు 


మనసు: ఎదుటివాని మనసు బాదపడకుండా మాట్లాడటం నేర్చుకో అద్దం  ఒక్క సారి ముక్కలైతే తిరిగి అతకలేమని తెలుసుకో .,...

కష్టపడందే: ఉన్నతస్తానం పొందలేవు ఉలి దెబ్బలు తినందే రాయి దైవం గ మారలేదు ..,...

జీవితమ్: జీవించిన్ది కొన్నాళ్ళు అయిన ఉన్నతమ్ గా జీవించు క్షణకాలపు మెరుపు అయినా ఉజ్వలంగా వెలుగుతుంది గాలిదీపం , రానీయకు కొద్ది అనుమానాన్ని అయి న నీ   నీడను చూసి నువ్వే బయపడకు .,.

మంచివాడయితే గౌరవించు వయసులో చిన్నవాడయిన పెద్ద ఉప్పు నీటి సముద్రము కన్నా చిన్న మంచినీటి వాగే దాహం తీర్చేది .,.....

నిర్జీవం: చేట్టులేని భూమి ప్రాణం లేని జీవి నీరు లేని బావి నిప్పు లేని భోగ్గు జనం లేని ఊరు .,....

సగటు బ్రతుకు:దారిద్రపు అరికాళ్ళకి వడ్డిల బుట్లకి నలిగి మాసి మసై  పోతున్న సాక్స్ మధ్యతరగతి మనిషి.,

డైరీ: దాని హృదయం చాలా విశాలం అందుకే మంచి అయినా చెడు అయినా గుట్టుగా దాచుకుంటుంది రట్టు చేయకుండా నువ్వు చేసిన ప్రతి పని నీతో పాటు దానికి తెల్సని మరువకు ఏనాడు దాని ముందు కాలర్రేగారేయ్యకు.,..

అందినవరం: నీకు దొరకని దానిని వెతకొద్దు దొరికిన దానిని వదలొద్దు అందనిదానికోసం ఆసపడద్దు అందినా దానితో సంతృప్తి చెందు.,.

లోపమ్ : ఎదుటివాని లోపాన్ని ఎంచొద్దు నీ లోపాన్ని సరిదిద్దుకో.,,..కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి