20, జనవరి 2013, ఆదివారం

jivitadrushyalu(kavitalu)

                                                             కవితలు

           పల్లెతల్లి 

స్వచ్చమైన చల్లని చిరుగాలులతో
సెలయేటి మువ్వల సవ్వడులతో 
పచ్చటి మొక్కల తోరణాలతో 
పక్షుల స్వాగత కిలకిలరావాలతో 
సౌన్దర్యామ్రుతాన్ని చవి చూపుతూ
 ఆత్మీయతా అనురాగాలకు ఆలవామై 
సహజత్వానికి మారుపేరే "పల్లితల్లి"

                               ప్రేమంటే 

I- న వాళ్ళు ఎందరు ఉన్నా 
L- ప్పుడు నిన్నే పరితపిస్తూ 
O- క్క క్షణం కూడా నిన్ను 
V- డిచి పెట్టి ఉండలేక 
E- లోకంలో నే  
Y- పునకు నడిచేందుకు 
O- క్క క్షణం కాదు 
U- గ యుగాలైనా వేఛి వుంటా .,....

                             ఎదురు చూస్తున్నా 

నా గుండె గూటి లో చేరిన ఓ పావురమా నీ కోసమే బ్రతికే ఓ ప్రాణమా 
నన్ను విడిచి యెంత దూరమ్ వెళ్ళావో తెలియక నా మనసు పడే నరక యాతన తెలుసుకొని ఎంత త్వరగా తిరిగివస్తావని ఎదురు చూస్తూ వుంటాను ,.

                             "నా కిష్టం"

ముఖ ప్రీతి కోసం నా అంత గొప్పవాడు లేడని 
చిటేకేన వేలుమీద ఆకాశానికి ఎత్తి ప్రసంచించే 
వాళ్ళ కన్నా ముఖం ముందు తన తప్పులను 
చెప్పి తనను సరి అయిన మార్గంలో 
నడిపించాగలను అనే నమ్మకాన్ని ఎవరైతే 
కలిగిస్తారో అలాంటి వాల్లెంటేనే    " నాకిష్టం " 

                             స్వరూప 

రూపానికి ఆకారం
స్వరూపానికి మనిషాకారం 
మనిషాకారానికి  సంసాస్కరం

                           కవిత్వాలు,రత్నాలు 
హృదయ లోతుల నుండి పుడుతాయి కవిత్వాలు 
సముద్ర లోతుల నుండి పుడుతాయి రత్నాలు 
కవిత్వాలు సంతోషాన్ని తెచ్చిపెడితే ,
రత్నాలు అందాన్ని తెచ్చిపెడతాయి .,..

                               క్రూరత్వమ్ 

మాత్రుమూర్తి గర్భంలో నవమాసాలు నిండకుండానే 
సాంకేతిక నైపుణ్యపు స్నానింగ్ లో " ఆడపిల్ల "అని తెలిసిన తద్యం 
అజ్ఞానం తో అబార్షన్ తనలాగే తన తల్లి ఆలోచిస్తే తనే ఉండదని                    మరుస్తూ ఈ నేటితరం యువతీ యువకులు  

రచయిత మరియు రచయిత్రి 

'అక్షరానికి 'విలువనిచ్చి 
'పదానికి' పరువునిచ్చి 
'వాక్యానికి' ఆర్దాన్నిచ్చి 
ఆ అర్దాన్ని పరమార్దం చేసి 
ఆ పరమార్ధాన్ని పదిమందికి 
తెలియజెప్పే గొప్ప వ్యక్తి 
  రచయిత 
ఒక చేత వలన మనిషి మారకపోవచ్చు 
కాని ఒక రచన వలన మారుతాడు 
ఎందుకంటే ఒక చేత మనిషిలో ద్వేషాన్ని పెంచుతుంది 
 అదే ఒక రచన మనిషిని ఆలోచింపజేస్తుంది 
ఆ ఆలోచనల నుండి మనిషిని మార్పు వైపు నడిపిస్తుంది .,.
                                                                     
                                                                       మీ ,
                                                                                              మహాలక్ష్మి రాణి                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి