29, జనవరి 2013, మంగళవారం

jivithadrushyalu( stories)

                                                   
                           దైర్యమే సాహసము 

రచయిత:పి.ఎస్.ఎస్.వి.వి.మహాలక్ష్మి రాణి                                                            కథ ; జరిగిన కథ 
                                                                                                                            తూ .గో.జిల్లా 
                                                                                                                        



                                      ది ఒక అందమైన ప్రకృతీ సోయగాలతో మెరిసే పల్లెటూరు  ఎటు చూసిన పక్షుల
కిలకిల రాగాలతో పచ్చని ప్రకృతీ పైరు గాలులతో నెలకొన్న వాతావరణము, ఆ వాతావరణము మద్య ఒక అందమైన

కుటుంబం కాపురముండేది . ఆ చక్కని కుటుంబంలో ఇద్దరు దంపతులు ఉండేవారు .వారికి

లేక లేక చాల ఏళ్ళకి ఒక  అమ్మాయి పుట్టింది గారాబంగా పెరిగింది ,అందమైన కుందనపు బొమ్మ తెలివైన

అమ్మాయి విద్యలోను ఆటలలోనూ తన తర్వాతే ఇంకెవరు అయిన స్కూల్ కి వెళ్ళడం బాగా చదవడం మంచి

మార్కులు తెచ్చుకోవడం తోటి పిల్లలతో కలిసి ఆడి పాడడం ,.,..సంతోషం గ వుండడం మాత్రమే ఆమెకి తెలిసినవి .,.

ఇలా 12 సంవత్సరములు గడిచాయి ,.

                                                      ఒక రోజు స్కూల్ కి వెల్లుతున్నప్పుడు ,...తనని కొంత మంది దుండగలు

మత్తు ఇచ్చి కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకోని వెళ్తున్నారు .

  తనని తీసుకోని వెళ్తున్న ప్లేస్ తనకే తెలియదు ఎందు  కంటే అప్పటికే సృహ కోల్పోయింది సాయంత్రం అయింది తల్లి 

తండ్రులు కూతురి కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పటికి రాకపోయే సరికి స్కూల్ కి

వెళ్లి కనుకున్నారు ఉదయం నుంచే రాలేదు అని చెప్పారు .,.తెలిసిన వారందరినీ సంప్రదించారు .,.చివరికి

జాడ తెలియక పోయే సరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు .,.అప్పటికే kidnapers చాలాదూరం తీసుకేల్లిపోయారు .

ఆ వాన్ ని చెట్ల మద్యలో పెట్టి దూరంగా కూర్చొని

మందు  తాగుతున్నారు .,..ఇంతలో ఆ అమ్మాయి మేలుకోవ వచ్చి కిడ్నాప్ అయిన విషయం గమనించి దైర్యం చేసి

 నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది .దూరంగా గ ఒక చిన్న లైట్ కనిపించడం

తో అక్కడికి పరిగెట్టు కొంటు వెళ్లి చూసింది అక్కడ ఒక పెద్దాయన ఉన్నాడు తనకి జరిగింది చెప్పి తన వూరు చెప్పి 

తనని వాళ్ళ తల్లి తండ్రుల దగ్గరకు పంపించమని బ్రతిమలాడింది ఆయన వెంటనే ఆ వురి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి 

విషయం వివరించాడు .,..వెంటనే పోలీస్ అధికారులు అక్కడకి వచ్చి,kidnapers పట్టుకొని , తనను తీసుకోని వెళ్లి

వాళ్ళ తల్లి తండ్రులను అప్పగించారు  .,.ఆ అమ్మాయి దైర్యాన్ని మెచ్చుకొని తనని ఇంటికి పంపించారు
                                        
                                   ఇప్పుడు తను పెద్దది అయి చదువుకొని మెడికల్ ఫీల్డ్ లో వర్క్  చేస్తుంది ,.,.   

నీతి:  దైర్యం ఎప్పుడు విజయాన్ని సాదిస్తుంది కాబట్టి దైర్య సాహసాలే విజయానికి తోలి మెట్టు , కాబట్టి దైర్యము తో వుండండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి